NS Murty తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;NS Murty

శ్రీనివాస్‌గారూ,

“ఆర్యభటీయం, గోళాధ్యాయంలో, 9-10 శ్లోకాల్లో… పడవలో ముందుకి ప్రయాణిస్తున్న వ్యక్తికి ఒడ్డున ఉన్న వస్తువులు, అవి నిలకడగా ఉన్నప్పటికీ ఎలాగైతే వెనక్కి వెళుతున్నట్టు కనిపిస్తాయో, నక్షత్రాలూ. గ్రహాలూ కూడా ‘లంక’కి (ఆ రోజుల్లో ఆ ప్రదేశాన్ని భూమధ్యరేఖ-సున్నా డిగ్రీల రేఖాంశమూ ఖండించుకునే బిందువు వద్ద ఉన్నట్టుగా భావించేవారు) పడమరగా నడుస్తున్నట్టు కనిపిస్తాయి” అని అన్నాడు. భూమి నిశ్చలంగా ఉంటుందని అప్పటి వరకూ ఉన్న విశ్వాసాలకి వ్యతిరేకంగా, భూమి తన ఇరుసుమీద తిరుగుతుందని చెప్పడం వరకు విప్లవాత్మకమే. అందుకనే అతను వరాహమిహిరుడు, భాస్కరాచార్య-I వంటి వారి విమర్శలకు గురయ్యాడు. కేరళలోని సంగమగ్రామానికి చెందిన మాధవ (1340- 1425) గురుకులానికి చెందిన వారు ఆర్యభట-I అనుయాయులే గనుక అతని మౌలిక భావనని, పరిశీలన, పరిశోధనల ద్వారా ముందుకి తీసుకువెళ్ళి ఉంటారు అని అనుకోవచ్చు. ఆర్యభట-I సూర్య-కేంద్రక వ్యవస్థని ప్రతిపాదించేడనడం వాస్తవం కాకపోవచ్చు. నాలుగు శతాబ్దాలు పైగా కొనసాగిన ఈ గురుపరంపరలో, నీలకంఠసోమయాజి (14 జూన్ 1444 – 1544) కూడా, సూర్య, చంద్రులు భూమి చుట్టూ తిరుగుతుంటే, తక్కిన గ్రహాలు మాత్రం సూర్యుని చుట్టూ తిరుగుతాయని భూ-కేంద్రక వ్యవస్థకీ, సూర్య-కేంద్రక వ్యవస్థకీ మధ్యేమార్గంలో ఉన్న ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. అది పూర్తిగా సూర్య-కేంద్రక వ్యవస్థ కాదు. టైకో బ్రాహి కూడా సరిగ్గా ఇదే ప్రతిపాదన చేశాడు. ఆయనకి భూ-కేంద్రక వ్యవస్థపై మక్కువకి మతపరమైన విశ్వాసం ఒక కారణం అయితే, అతని దగ్గర అప్పటి ప్రమాణాలకి సున్నితమైన పరికరాలున్నప్పటికీ stellar parallaxని కనుక్కోలేకపోవడం రెండవ కారణం.

అభివాదములతో,
NS మూర్తి.


04 April 2024 9:51 AM

అనువాదలహరి;NS Murty

Thank you Naga garu. I am humbled by your comment. But there is nothing great about it.

మెచ్చుకోండి


27 October 2020 10:15 AM

అనువాదలహరి;NS Murty

‌కి స్పందనగా.

Thank you Narasimha Rao garu. I know he is your brother and you have responded on two or three occasions. I heard the poem from Pravasi Manch program only and when I did not have his mail Manasa sent me his mail id and poem. Thank you for your kind response. With best regards
NS Murty

మెచ్చుకోండి


30 June 2020 4:01 PM

అనువాదలహరి;NS Murty

‌కి స్పందనగా.

మీ లాంటి పెద్దల వ్యాఖ్య ఎంత ఉత్సాహాన్నిస్తుందో చెప్పలేను. హృదయపూర్వక కృతజ్ఞతలు.
అభివాదములతో

మెచ్చుకోండి


07 May 2020 12:29 PM

అనువాదలహరి;NS Murty

‌కి స్పందనగా.

Dr. Jenevieve DeLosSantos,

I hereby accord my permission to use my translation of Smt. Nirmala Kondepudi’s Poem “We Don’t Want This Tradition” for your “Poetries- Politics: A Multilingual Project” . You can reproduce it.
May I request you to kindly send a soft copy of the project for my record and sharing with Smt. Kondepudi Nirmala.
Thank you in advance,
NS Murty

మెచ్చుకోండి


10 April 2020 10:16 PM

అనువాదలహరి;NS Murty

‌కి స్పందనగా.

Thank You Rao garu.

మెచ్చుకోండి


31 January 2020 7:20 PM

తెలుగు కథలు పద్యాలు;NS Murty

Reblogged this on .


18 March 2018 3:16 PM

తెలుగు కథలు పద్యాలు;NS Murty

‌కి స్పందనగా.

హనుమంత రావుగారూ,

మీ అమూల్యమైన అభిప్రాయాలు నాకు మార్గదర్శకాలు. మీలాంటి సాహిత్యప్రేమికుల స్నేహం ఎంతో అదృష్టంచేసుకుంటేనే గాని రాదు.

అభివాదములతో


01 April 2013 7:43 AM

తెలుగు కథలు పద్యాలు;NS Murty

‌కి స్పందనగా.

తరుణ్ ప్రీతమ్ గారూ,

నా బ్లాగుకి స్వాగతం. మీ ప్రోత్సాహపూర్వకమైన వ్యాఖ్యకు ధన్యవాదాలు.

అభివాదములతో


25 March 2013 7:39 AM